Sunday, September 18, 2016

postal dept fillup 55, 000 posts in november month

పోస్టు మాస్టర్ పోస్టులకు 10 వతరగతి, డెలివరీ బాయ్స్ కి 8వ తరగతి ఉత్తీర్ణత అవసరం.

🖥ఆన్‌లైన్ విధానంలో నియామకం

📨దేశవ్యాప్తంగా పోస్టల్ విభాగంలో మొత్తం 55వేల గ్రామీణ డాక్‌సేవక్ పోస్టులను నవంబర్‌లో భర్తీ చేయనున్నట్టు భారత పోస్టల్ విభాగం సెక్రెటరీ బీవీ సుధాకర్ తెలిపారు. పోస్టుల భర్తీ ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో చేపట్టనున్నామని ఆయన వెల్లడించారు.

📩ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, నవంబర్‌లో నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు.





📧దేశవ్యాప్తంగా పోస్టల్ విభాగం పనితీరు, మరింత మెరుగైన సేవలందించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
గ్రామీణ డాక్‌సేవక్ పోస్టుల్లో బ్రాంచ్ పోస్టుమాస్టర్‌కి పదో తరగతి , పోస్ట్ మాస్టర్ కాకుండా డెలివరి సిబ్బందికి ఎనిమిదవ తరగతి విద్యార్హతగా ఉంటుందని చెప్పారు. అభ్యర్థుల పదోతరగతి మెమో,కులధ్రువీకరణ, తదితర ధ్రువీకరణ పత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే, వాటిని పరిశీలించిన తర్వాత అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకే తొలిసారిగా ఆన్‌లైన్ విధానాన్ని తీసుకువస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు మరింత నాణ్యమైన సేవలందించేందుకు పోస్టల్ వ్యవస్థలో సాంకేతికత వినియోగాన్ని పెంచడంతోపాటు వినూత్నమైన మార్పులు తెస్తున్నామన్నారు.

0 comments:

Post a Comment