Sunday, September 18, 2016

ap sub inspector job notification released

AP SI NOTIFICATION:

707 ఉద్యోగాలు భర్తీ చేయనున్న పోలీసు నియామక మండలి

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సివిల్‌, ఏఆర్‌ ఎస్సై, సీపీఎల్‌ ఆర్‌ఎస్సై, డిప్యూటీ జైలర్‌, అసిస్టెంట్‌ మేట్రాన్‌ పోస్టుల భర్తీ కోసం ఏపీ పోలీసు నియామక మండలి శనివారం ప్రకటన జారీ చేసింది. మొత్తం 707 ఉద్యోగాలను (పోస్టులు) భర్తీ చేయనున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ అతుల్‌సింగ్‌ తెలిపారు.

* దరఖాస్తుల స్వీకరణ: ఈ నెల 23 ఉదయం 10 నుంచి వచ్చే నెల 24 సాయంత్రం 5 వరకూ

* ప్రాథమిక రాత పరీక్ష:27.11.2016 ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకూ పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకూ పేపర్‌-2

* వయోపరిమితి: ఎస్సై పోస్టులకు 21-27 ఏళ్లు, డిప్యూటీ జైలర్‌ పోస్టులకు 21-30 ఏళ్లు, అసిస్టెంట్‌ మేట్రాన్‌ పోస్టులకు 21-25 ఏళ్లు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

* సివిల్‌ విభాగంలో పోస్టులకు మహిళలకు 33 1/3 శాతం, ఏఆర్‌ విభాగంలోని పోస్టులకు 20 శాతం రిజర్వేషన్లు ఉంటాయి.

* ప్రాథమిక రాత పరీక్ష అర్థమెటిక్‌, రీజినింగ్‌, మెంటల్‌ ఏబిలిటీ అంశాలపైన 100 మార్కులకు పేపర్‌-1, జనరల్‌ స్టడీస్‌ 100 మార్కులకు పేపర్‌-2 ఉంటుంది

* ప్రాథమిక రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులో ఎంపికైన వారికి తుది రాత పరీక్ష ఉంటుంది. దీనిలో ఆంగ్లం, తెలుగు, అర్థమెటిక్‌, రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ, జనరల్‌ స్టడీస్‌ విభాగాల్లో 4వేర్వేరు పేపర్లు ఉంటాయి.

* వివరాల కోసంhttp://recruitment.appolice.gov.in/ను చూడొచ్చు.

0 comments:

Post a Comment