Saturday, September 17, 2016

PLEASE CHANGE YOUR ATM PIN URGENTLY

💳ఏటీఎం యూజర్లందరూ వెంటనే పిన్ మార్చుకోండి!

💡ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ:

sir/madem.ఏటీఎం కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగదారులు వెంటనే తమ ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని దేశంలోని అన్ని బ్యాంకులు తాజాగా హెచ్చరికలు చేస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఫెడరల్ బ్యాంక్, డీసీఎస్ బ్యాంకులు ఇప్పటికే తమ ఖాతాదారులను మసేజ్‌ల ద్వారా అలర్డ్ చేస్తున్నారు. ఏటీఎం మోసాలు రోజురోజుకూ పెరుగుతుండడంతో ఖాతాదారులకు సేఫ్ బ్యాంకింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. సెక్యురిటీ గార్డు లేని, జనావాసాలు లేని ప్రాంతాలలో ఉన్న ఏటీఎంలను ఉపయోగించకూడదని బ్యాంకులు సూచిస్తున్నియి.

కేరళ, ఢిల్లీ, చండీఘడ్ రాష్ట్రాల్లో వెలుగు చూసిన ఏటీఎం స్కాం నేపథ్యంలో బ్యాంకులన్నీ తాజాగా ఈ ఆదేశాలు జారీ చేశాయి. తమ ఖాతాల నుంచి లక్షల రూపాయల నగదు మాయమైందని పలువురు ఏటీఎం వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యియి. దీంతో బ్యాంకుల అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. కొందరు దుండగులు ఏటీఎం సెంటర్లలో స్కిమ్మింగ్ పరికరాన్ని అమర్చుతూ వినియోగదారుల డేటాను పసిగట్టి, డబ్బులను దొబ్బేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని బ్యాంకులకు ఆర్‌బీఐ హెచ్చరికలు జారీ చేసింది.

దేశంలోని 650 మిలియన్ ఏటీఎం కార్డుల్లో దాదాపు 60 శాతం కార్డులు మ్యాగ్నెటిక్ స్ట్రిప్‌ను కలిగి ఉంటాయి. అందులోనే అకౌంట్‌కు సంబంధించిన సమాచారం ఉంటుంది. అయితే స్కిమ్మింగ్ పరికరం ద్వారా దొంగలు ఆ మ్యాగ్నెటిక్ స్ట్రిప్‌ను స్కాన్ చేస్తున్నారు. అందువల్ల మ్యాగ్నెటిక్ స్ట్రిక్‌ బదులు ‘చిప్ బేస్డ్ ఈఎంవీ’ విధానాన్ని వాడాల్సిందిగా బ్యాంకులకు ఆర్బీఐ సూచిస్తోంది. అంతేకాకుండా ఆర్బీఐ మరో ముఖ్యమైన సూచన కూడా చేసింది.

ప్రస్తుతం ఏటీఎంలలో రెండు రకాల మెషిన్‌లు ఉన్నాయి. ఒకటి కార్డును స్వైప్ చేసి, వెంటనే తీసేసి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. రెండో రకం మెషిన్‌లో అయితే మన ట్రాన్సాక్షన్ పూర్తయ్యే వరకు కార్డు మెషిన్‌లోనే ఉంటుంది.

 ఈ రెండు రకాల మెషిన్స్‌లో మెదటి రకం మెషిన్ కొంచెం సేఫ్ అని,

అలాంటి మెషిన్స్‌లో ట్రాన్సాక్షన్‌కే ఇంపార్టెంట్ ఇవ్వాలని ఆర్బీఐ హెచ్చరిస్తోంది.

0 comments:

Post a Comment